Monday, December 23, 2024

విజయ్‌ దేవరకొండ ‘థమ్సప్‌’ వీరోచిత పోరాటాలు.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

Vijay Devarakonda Thumbs Up Ad

హైదరాబాద్‌: కోకా కోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రాండ్‌ థమ్సప్‌, ఇప్పుడు యాక్షన్‌కు నూతన ముఖచిత్రంగా వెలుగొందుతున్న విజయ్‌ దేవరకొండతో భాగస్వామ్యం చేసుకుని తమ బ్రాండ్‌ కోసం నూతన ప్రచారం ప్రారంభించింది. ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ ప్రచారంలో దక్షిణాది సూపర్‌స్టార్‌ కనిపించనున్నారు. తమకెదురైన కష్టాలతో వీరోచితంగా పోరాడి అత్యున్నత స్ధానానికి చేరుకున్న హీరోలకు థమ్సప్‌ వందనం చేస్తుంది. ఒలింపిక్‌, పారా ఒలింపిక్‌ గేమ్స్‌ మరియు క్రికెట్‌తో లోతైన అనుబంధం ఏర్పరుచుకోవడానికి ఈ బ్రాండ్‌ కట్టుబడి ఉండటంతో పాటుగా భారతీయ అథ్లెట్లతో తమ భాగస్వామ్యం కొనసాగిస్తుంది. ఈ నూతన ప్రచారం, బ్రాండ్‌ యొక్క కీలక విలువను ఉదహరించడంతో పాటుగా ప్రతికూలతలు ఎదురైనప్పటికీ అచంచలమైన ధృడత్వాన్ని ప్రదర్శించే బ్రాండ్‌ యొక్క ప్రధాన విలువలను వివరిస్తుంది.

ఈ నూతన ప్రచారం గురించి సుమేలీ చటర్జీ, హెడ్‌– ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ (ఐఎంఎక్స్‌), కోకా–కోలా ఇండియా మాట్లాడుతూ ‘‘వినూత్నమైన రుచి కారణంగా థమ్సప్‌ను ఎక్కువ మంది అభిమానిస్తుంటారు. మా కలలను వేడుక చేసుకోవడానికి నిరంతర నిబద్ధతనూ మేము చాటుతుంటాం.ఈ థమ్సప్‌ స్ట్రాంగ్‌ ప్రచారం వైవిధ్యమైన తమ స్ట్రాంగ్‌ రుచిపై నిర్మితం కావడంతో పాటుగా తమ ‘పలత్‌ డే’ క్షణాల కోసం లక్ష్యం చేసుకుని తమ అంతర్గత శక్తిపై నమ్మకం ఉంచాల్సిందిగా వీక్షకులను కోరుతుంది. ఎన్నడూ వెన్నుచూపొద్దు అనే థమ్సప్‌ ధోరణిని ఈ తుఫాన్‌ (థండర్‌) భావోద్వేగంలో చూపడంతో పాటుగా అప్‌సైడ్‌ బాటిల్‌ యాక్షన్‌ ద్వారా ప్రదర్శించాము’’ అని అన్నారు.

ప్రకటనల పరంగా థమ్సప్‌ ఎప్పుడూ కాలానికన్నా ముందే ఉండటంతో పాటుగా బ్రాండ్‌ యొక్క యూత్‌ఫుల్‌ ధోరణికి అనుగుణంగా తమ ప్రచారాలను నేపథ్యీకరిస్తుంటుంది. థమ్సప్‌ యొక్క శక్తివంతమైన రుచి, కొద్దిగా సోడా తో మిళితం కావడం ద్వారా సాహసస్ఫూర్తిని వివరించడంతో పాటుగా ఈ డ్రింక్‌ తాగే వ్యక్తుల వ్యక్తిత్వపు శక్తినీ వెల్లడిస్తుంది. ఈ బ్రాండ్‌ ఇప్పుడు తమ నూతన ముఖచిత్రంగా విజయ్‌ దేవరకొండను సమర్పించడం పట్ల ఆనందంగా ఉంది. ఈ ప్రకటన సాహసోపేతంగా ఉండటంతో పాటుగా వేగవంతంగానూ ఉంటుంది. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తన నటనా చాతుర్యం ప్రదర్శించిన విజయ్‌, ఈ సంవత్సరం తన లైగర్‌ చిత్ర విడుదల కోసం చూస్తున్నారు. ఇప్పుడు థమ్సప్‌తో విజయ్‌ దేవర కొండ యాక్షన్‌ రంగంలో అడుగుపెట్టారు. ఈ ప్రచారం ద్వారా సాఫ్ట్‌ డ్రింక్‌ కాదు, తుఫాన్‌ అని చెబుతున్నాం. దీనిద్వారా లక్షలాది మంది భారతీయులతో కనెక్ట్‌ కావడంతో పాటుగా తమ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటుగా కష్టపడి హీరోలుగా తామెంచుకున్న రంగాల్లో నిలిచిన వ్యక్తులతో కనెక్ట్‌ అవుతున్నాం.

నూతన థమ్సప్‌ ప్రచారం గురించి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నా హృదయంలో థమ్సప్‌కు ప్రత్యేక స్థానం ఉంది. నాకెప్పుడూ ఇది అత్యంత ఇష్టమైన శీతలపానీయం. వేసవికాలం, రోజంతా ఆటలాడి, థమ్సప్‌ తాగితే, ఆహ్లాదం…ఫిజ్జీ, శక్తివంతమైనరుచి కలిగిన ఈ డ్రింక్‌కు సాటి మరేదీ లేదు. బిర్యానీతో కలిపి తీసుకుంటే ఇది ఇంకా అద్భుతం. థమ్సప్‌ నూతన ముఖచిత్రంగా నిలువడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. కృషి, సంకల్పం, చురుకుదనంకు ప్రతీకగాథమ్సప్‌ నిలుస్తుంది’’అని అన్నారు.

సుకేష్‌ నాయక్‌, చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌, ఓగ్లీవీ ఇండియా మాట్లాడుతూ ‘‘స్ట్రాంగ్‌ డ్రింక్‌ను ఆవిష్కరించాలనే పెద్ద ఆలోచన నాకు సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్‌ డ్రింక్‌ పదం విన్న తరువాత కలిగింది. థమ్సప్‌ లాంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌ ఎప్పుడూ కూడా ఎన్నడూ వదులుకోవద్దనే ధోరణిని సూచిస్తుంటుంది. అందువల్ల దీనికి ప్రత్యేక పదంతో సూచించాలనుకున్నాను. అందుకే సాఫ్ట్‌ డ్రింక్‌ కాదు, తుషాన్‌ అని పిలిచాము. తుఫాన్‌కు ప్రతీక విజయ్‌. తుఫానీ శైలిలో మా ఆలోచనకు వాస్తవ రూపం తీసుకురావడంలో భాగంగా ఆయనతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.

‘‘ఒకవేళ మీరు థమ్సప్‌ ప్రేమికులు అయితే, అయితే ఏమిటి, మనలో చాలామంది థమ్సప్‌ ప్రేమికులే. వారందరికీ తెలుసు, దీని రుచి అద్భుతం కానీ సాఫ్ట్‌ డ్రింక్‌ అని. అందవల్ల మేము దీనిని సాఫ్ట్‌ డ్రింక్‌ విభాగం నుంచి దీనిని తీసి వేయడంతో పాటుగా తనదైన విభాగం ః సాఫ్ట్‌ డ్రింక్‌ కాదు, తుఫాన్‌ అని సృష్టించాము. థమ్సప్‌ యొక్క వైవిధ్యమైన రుచి, అది సృష్టించే తుఫానుకు అంతే తుఫాన్‌ ముఖచిత్రం కావాల్సి ఉంది . అందుకే రౌడీ విజయ్‌ దేవరకొండను కలిశాం. తుఫాను కోసం తుఫాను!’’ అని రీతు షార్ద, చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌, ఓగ్లీవీ ఇండియా (నార్త్‌ ) అన్నారు

ఈ ప్రచార చిత్రాలను టీవీ, సోషల్‌, డిజిటల్‌, ఓఓహచ్‌ మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడంతో పాటుగా ప్రేక్షకులతో ఇంటరాక్టివ్‌ ప్రచారాలను కూడా నిర్వహించడం ద్వారా స్టోరీటెల్లింగ్‌లో అభిమానులు సైతం పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

Vijay Devarakonda Thumbs Up Ad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News