ముంబై: నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నతో నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఫోటోలు నేడు(శనివారం) మళ్లీ షేర్ చేసుకున్నారు. విజయ్ కి రష్మిక మంచి గర్ల్ ఫ్రెండ్ అని కూడా చాలా మంది భావిస్తున్నారు. వారిద్దరూ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయినప్పటికీ ఆ సినిమాలోని పాట ‘‘కడలల్లే’’ యూట్యూబ్ లో 400 మిలియన్ వ్యూస్ సాధించినందుకు దేవరకొండ విజయ్ ఫోటోను రీషేర్ చేస్తూ, అది తన ఇష్టమైన పాట అని పేర్కొన్నారు.
‘డియర్ కామ్రేడ్’ సినిమా 2019లో రిలీజ్ అయినప్పటికీ, ఆ సినిమాను ఇప్పటికీ మరచిపోలేకుండా ఉన్నానని, ఆ సినిమా, దాని కథ, పాట ఇప్పటికీ తనకిష్టమేనని పేర్కొన్నారు. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో రష్మిక ఓ క్రికెటర్, కాగా అందులో విజయ్ దేవరకొండ ఓ విద్యార్థి నాయకుడిగా నటించారు. జులై 26 నాటికి ఈ సినిమా విడుదలై 5 ఏళ్లు అవుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. విజయ్ దేవరకొండ తాజా సినిమా ‘ఎస్ విసి 59’ త్వరలో రాబోతోంది. అంతేకాదు ‘ ఫ్యామిలీ స్టార్’ సినిమా నిర్మించిన దిల్ రాజు మరో సినిమాను విజయ్ దేవరకొండతో నిర్మించబోతున్నారు. ‘ట్యాక్సీవాలా’ సినిమాకు డైరెక్టర్ గా పనిచేసిన రాహుల్ సంకృత్యాన్ తో తన 14 వ సినిమా చేయబోతున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ తన పుట్టిన రోజు మే 9న అని పేర్కొన్నారు. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించిన తన 13 చిత్రం కూడా విడుదల కానున్నదని ప్రకటించారు. తన ‘విడి14’ సినిమా పోస్టర్ ను విజయ్ దేవరకొండ గురువారం ‘ఎక్స్’ వేదికలో పోస్ట్ చేశారు. ఆ సినిమా రాయలసీమ ప్రాంతానికి చెందిన యాక్షన్ చిత్రం. దానిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలిపారు. మరోవైపు రష్మిక హిందీ యాక్షన్ థ్రిల్లర్ ‘సికందర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రక్కన నటిస్తోంది. అంతేకాదు ఆమె అల్లు అర్జున్ ‘పుష్ప2’లో కూడా నటిస్తోంది. ఇంకా ధనుష్, నాగార్జున, జిమ్ సర్భ్ నటిస్తున్న ‘కుబేర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.