Sunday, December 22, 2024

ప్రభాస్ మూవీలో విజయ్ దేవరకొండ!

- Advertisement -
- Advertisement -

సలార్ సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’పై దృష్టి పెట్టారు. భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నిర్మాణంలో ఉన్న ఈ మూవీ మే9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్ కూడా నటిస్తుండటంతో కల్కి మూవీపై అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వీరే కాకుండా తాజాగా ఇద్దరు యువ హీరోలను కూడా నాగ్ అశ్విన్ ఈ మూవీలో నటించేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతోపాటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా కల్కి మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. నాగ్ అశ్విన్ కు, విజయ్  దేవరకొండకూ మధ్య చాలాకాలంగా స్నేహం ఉంది. అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యంలో విజయ్ గెస్ట్ రోల్ లో నటించాడు.

ఆ తర్వాత తీసిన మహానటి, జాతిరత్నాలు మూవీల్లోనూ విజయ్ గెస్ట్ రోల్స్ చేశాడు. దీంతో ఒకవిధంగా విజయ్ ది అచ్చొచ్చిన హ్యాండ్ అనే చెప్పాలి. తాజాగా కల్కిలోనూ విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ మూవీలో విజయ్ రోల్ కాస్త పెద్దదేనని అంటున్నారు. కాగా, దుల్కర్ సల్మాన్ కూడా కల్కిలో ఓ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడట. దీనిపై కల్కి టీమ్ పెదవి విప్పట్లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News