Sunday, January 19, 2025

కేజ్రీవాల్ కోసం బిజెపి అంబులెన్స్

- Advertisement -
- Advertisement -

వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు బిజెపి సీనియర్ నేత విజయ్ గోయల్ శనివారం ఒక అంబులెన్స్‌ను పంపారు. తాను కొన్ని తీవ్ర రుగ్మతలతో బాధ పడుతుండవచ్చునని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత తెలిపిన తరువాత విజయ్ గోయల్ ఆ పని చేశారు. అయితే, ఢిల్లీ సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అధికార నివాసం దారిలోనే అంబులెన్స్‌ను, గోయల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల సానుభూతి సంపాదించేందుకు ఆరోగ్య సమస్యల ప్రస్తావన ద్వారా కేజ్రీవాల్ ‘నాటకం ఆడుతున్నారు’ అని గోయల్ ఆరోపించారు. ‘రెండు గంటల లోపే కేజ్రీ పరీక్షలు అన్నీ నిర్వహించేందుకు వీలుగా ఏ ఆసుపత్రికైనా ఆయనను ఈ అంబులెన్స్ తీసుకువెళుతుంది’ అని గోయల్ విలేకరులతో చెప్పారు. ముఖ్యమంత్రి ‘నాటకం’ ఆపాలని, తన ఆరోగ్యం విషయమై నిజంగా ఆందోళన ఉన్నట్లయితే, ఆయన పరీక్షలకు రావాలని మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News