విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానాపై కర్ణాటక విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హర్యానా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు, గోపాల్, ప్రసిద్ధ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నాటక జట్టు 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దేవదత్ పడిక్కల్ 86 పరుగులు, స్మరన్ రవిచంద్రన్ 76 పరుగులతో రాణించారు. దీంతో కర్ణాటక 5వికెట్ల తేడాతో హర్యానాపై గెలుపొంది ఐదవసారి ఫైనల్ కు వెళ్లింది. విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌కు చేరిన ప్రతిసారీ కర్ణాటక టైటిల్ గెలుచుకుంది. ఇక, రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో విదర్భ, మహారాష్ట్ర జట్లు తలడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ పోరులో కర్నాటకతో ఢీకొననుంది.