Monday, December 23, 2024

వీరప్పన్‌ను మట్టుబెట్టిన విజయ్ కుమార్ రాజీనామా..

- Advertisement -
- Advertisement -

Vijay Kumar resigns as Security Advisor of MHA

న్యూఢిల్లీ: తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టిన ఐపిఎస్ మాజీ అధికారి కె విజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని ఆయన నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. అక్కడి నుంచి తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు తెలిపారు. ‘వ్యక్తిగత కారణాలతో హోం శాఖలో బాధ్యతలకు స్వస్తి చెప్పి ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చాను’ అని విజయ్ కుమార్ మీడియాకు చెప్పారు. హోం శాఖ భద్రతా సలహాదారుగా అవకాశమిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సహకారం అందించిన హోం శాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కశ్మీర్ లోయలో దిగజారిపోతున్న శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు వి.యకుమార్ ఇచ్చిన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.

1975 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన విజయ్ కుమార్ కేంద్ర రిజర్వ్ పోలీసు దళం(సిఆర్‌పిఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో రిటైరయ్యారు. అనంతరం హెం మంత్రిత్వ శాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ, కశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్‌కు భద్రతా సలహాదారుగా విజయ్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. అంతకు ముందు ఆయన తమిళనాడు లో స్పెషల్ టాక్స్‌ఫోర్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే పక్కా ప్రణాళికతో వీరప్పన్‌ను మట్టుబెట్టారు. చెన్నై పోలీసు కమిషనర్‌గా, జమ్మూ కశ్మీర్‌లో బిఎస్‌ఎఫ్ ఐజిగాను ఆయన సేవలు అందించారు.

Vijay Kumar resigns as Security Advisor of MHA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News