Saturday, November 23, 2024

రాజీనామాకు బీహార్ స్పీకర్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

Vijay Kumar Sinha refuses his Resign as Speaker

పాట్నా: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ఈనెల 24న అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించారు. అయితే, బీజేపి ఎమ్‌ఎల్‌ఎ అయిన విజయ్ కుమార్ సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. 50మంది ఎమ్‌ఎల్‌ఎలు ఈ మేరకు సంతకాలు చేసి అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. నిబంధనల ప్రకారం స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై 14 రోజుల తరువాత చర్యలు చేపట్టాలి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో సిఎం నితీశ్ కుమార్ సర్కార్ బల పరీక్ష కాస్త ఆలస్యం కానున్నది. సాధారణంగా ప్రభుత్వం మారగానే తన పదవికి స్పీకర్ రాజీనామా చేయాలని, అయితే బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ అయిన విజయ్‌కుమార్ సిన్హా ఆ పదవి నుంచి తప్పుకోలేదని జేడీయూ నేత తెలిపారు. దీంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్టు వెల్లడించారు.

Vijay Kumar Sinha refuses his Resign as Speaker

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News