Friday, January 10, 2025

విజయ్ సేతుపతి 50వ చిత్రం‘మహారాజా’

- Advertisement -
- Advertisement -

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన మైల్ స్టోన్ 50వ చిత్రం కోస ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ & థింక్ స్టూడియోస్ తో కలిపారు. గతంలో ‘కురంగు బొమ్మై’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నితిలన్ సామినాథన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, మరికొంత మంది ప్రముఖ నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా అజనీష్ లోక్‌నాథ్, దినేష్ పురుషోత్తమన్ కెమరామెన్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ట్రైలర్, ఆడియో, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో చేస్తారు మేకర్స్ .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News