Wednesday, January 22, 2025

ఆ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ చేయలేను: విజయ్ సేతుపతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మహారాజ’ సినిమాలో నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ కృతిశెట్టిని తీసుకుంటానని విజయ్ సేతుపతి సినీ దర్శకుడు చెప్పడంతో ఆమెను తిరస్కరించాడు. గతంలో రెండు సినిమాల్లో ఆ హీరోయిన్ తో నటించనని విజయ్ సేతుపతి తెలిపాడు. విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడారు. ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా నటించానని, ఆ చిత్రం మంచి విజయాన్ని అందించిందని, కూతురుగా నటించిన అమ్మాయితో రోమాంటిక్ సీన్స్ చేయలేనని వివరణ ఇచ్చాడు. ఉప్పెన సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం జరుగుతున్నప్పుడు కృతి ఆందోళనగా ఉండడంతో వెంటనే ఆమె వద్దకు వెళ్లి కంగారు పడకు అని చెప్పానని, తనకు నీ వయసు కుమారుడు ఉన్నాడని తనని తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పానని విజయ్ గుర్తు చేశాడు. కూతురితో జోడీగా నటించడం తన వల్ల కాదన్నారు. గతంలో డీఎస్‌పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటానంటే వద్దని చెప్పానని విజయ్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News