Sunday, December 22, 2024

విజయ్ సేతుపతి న్యూ లుక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కొద్ది నెలల క్రితం వచ్చిన విక్రమ్ చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతిని చూసిన వాళ్లకు ఇది నమ్మలేని నిజం. కొత్త విజయ్ సేతుపతిని ప్రేక్షకులు త్వరలో వెండి తెరపై చూపడనున్నారు. బరువు తగ్గిపోయి, స్లిమ్‌గా మారిన తన తాజా లుక్స్‌ను విజయ్ సేతుపతి స్వయంగా మిర్రర్ సెల్ఫీ రూపంలో బయటపెట్టాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్లిమ్‌గా ఉన్న విజయ్ సేతుపతి ఇటీవలి కాలంలో చాలా బరువు పెరిగాడు.

ఆ శరీకృతికి ఇక హీరో పాత్రలు కష్టమని ఇండస్ట్రీ మత్తం ఫిక్సయిపోయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైపోతాడని ఇండస్ట్రీ భావిస్తున్న తరుణంలో అందరికీ తన సెల్ఫీతో సేతుపతి షాకిచ్చాడు. అద్దం ముందు నిలబడి తీసుకున్న తన సెల్ఫీ ఫోటోను విజయ్ సేతుపతి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటో చూసి విజయ్ సేతుపతి అభిమానులకైతే ఆనందం పట్టడం లేదు. మళ్లీ హ్యాండ్‌సమ్ లుక్స్‌తో తమ అభిమాన నటుడు సంచలన విజయాలు అందుకోవడం ఖాయమని వారు సంబరపడిపోతున్నారు.

Vijay Sethupathi mirror selfie shows కొన్ని నెలలుగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సేతుపతి తన లుక్స్‌పై దృష్టిపెట్టి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ సేతుపతి అభిమానులకు మరో శుభవార్త ఏమిటంటే త్వరలో అతను బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కత్రినా కైఫ్ సరసన సేతుపతి నటిస్తున్న మెర్రీ క్రిస్మస్ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. అంధా ధున్ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీరాం రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం.
గాంధీ టాక్స్ అనే మూకీ చిత్రంలో కూడా సేతుపతి నటిస్తున్నాడు.

అలాగే ఎఆర్ రహ్మాన్ సంగీత దర్శకత్వంలో అదితీ రావు హైదరీ, అరవింద్ స్వామితో కలసి విజయ్ సేతుపతి నటిస్తున్న డార్క్ కామెడీ చిత్రానికి కిషోర్ బేలేకర్ దర్శకత్వం వహిస్తునన్నారు. ఈ ప్రాజెక్టులు కాక హిందీ వెబ్ సిరీస్‌లోకి కూడా సేతుపతి ప్రవేశిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఫర్జీ సిరీస్‌కు రాజ్ మరియు డికె దర్శకత్వం వహించనున్నారు. షాహీద్ కపూర్ కూడా ఈ సిరీస్‌లో నటించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News