Sunday, December 22, 2024

మెగాస్టార్‌ను ఢీకొట్టే విలన్‌గా…

- Advertisement -
- Advertisement -

Vijay Sethupathi plays villain role in Chiranjeevi's Movie

చిరంజీవి ఫుల్ మాస్ అవతారంలో దర్శనమివ్వబోతున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకుడు. త్వరలో మలేషియాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్కడ ఓ పాట, కొన్ని యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించబోతున్నారని టాక్. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో ప్రతి నాయకుడు ఎవరన్న విషయం బయటకు రాలేదు. చిత్ర బృందం ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచింది. ఈ పాత్ర కోసం ఓ స్టార్‌ని బరిలోకి దించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయని టాక్. ఈ సినిమాలో చిరుని ఢీకొట్టే గట్టి విలన్‌ని పట్టేశారని తెలిసింది. ఆ ఛాన్స్ విజయ్ సేతుపతికి దక్కిందట.

విజయ్ సేతుపతి, బాబిల మధ్య ఇటీవలే భేటీ జరిగింది. ఈ కథని విజయ్‌కి వినిపించడం, ఆయన విలన్‌గా నటించడానికి ఒప్పుకోవడం జరిగిపోయాయని తెలిసింది. ఇదివరకు ‘సైరా’లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించారు. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ చిరు అంటే విజయ్ సేతుపతికి అమితమైన అభిమానం. “మరోసారి ఛాన్స్ వస్తే చిరుతో కలిసి నటిస్తా”అని అప్పుడే తన మనసులో మాట బయటపట్టేశాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ అతనికి మరోసారి దక్కింది. త్వరలోనే విజయ్ సేతుపతి ఎంట్రీ గురించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

Vijay Sethupathi plays villain role in Chiranjeevi’s Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News