Wednesday, January 22, 2025

‘వారసుడు’ వస్తున్నాడు

- Advertisement -
- Advertisement -

Vijay Thalapathi's Varisudu first look released

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులని మైమరపించారు విజయ్. ఫస్ట్ లుక్‌లో స్టయిలిష్‌గా కనిపిస్తూనే సీరియస్ లుక్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది. ‘ది బాస్ రిటర్న్స్’ అనే ట్యాగ్ లైన్ మరింత ఆసక్తికరంగా వుంది. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్‌పై టైటిల్, పోస్టర్ ఆ అంచనాలని మరింత భారీగా పెంచాయి. అన్ని వర్గాల ప్రేక్షలని ఆకట్టుకునే చిత్రాలను రూపొందించే ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ‘వారిసు’ టైటిల్‌ని ఖరారు చేశారు.

ఈ చిత్రం కోసం బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్‌ను తయారు చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి… విజయ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో చూపించనున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్‌పై కీలకమైన భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Vijay Thalapathi’s Varisudu first look released

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News