Wednesday, January 15, 2025

‘దళపతి 67’తో రెండవ సారి…

- Advertisement -
- Advertisement -

స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ సినిమా రూపొందుతోంది. ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మాస్టర్’తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది.

కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.. ‘దళపతి 67’ కోసం నాలుగవ సారి విజయ్‌తో కలసి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి డిఓపిః  మనోజ్ పరమహంస, యాక్షన్‌ః అన్బరివ్, ఎడిటింగ్‌ః ఫిలోమిన్ రాజ్, ఆర్ట్‌ః ఎన్.సతీష్ కుమార్, కొరియోగ్రఫీః దినేష్, డైలాగ్ రైటర్స్‌ః  లోకేష్ కనగరాజ్, రత్న కుమార్, ధీరజ్ వైది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ః రాంకుమార్ బాలసుబ్రమణియన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News