Monday, December 23, 2024

త్వరలో తమిళనాడువ్యాప్తంగా హీరో విజయ్ పాదయాత్ర ?(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తమిళనాడులో మరో ప్రముక సినీనటుడు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? తళపతిగా అభిమానులు పిలుచుకునే విజయ్ సినీరంగానికి త్వరలోనే శాశ్వతంగా గుడ్‌బై చెప్పి రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

విజయ్ రాజకీయ ప్రవేశంపై చాలాకాలం నుంచి వార్తలు వస్తున్నప్పటికీ ఆయన నుంచి మాత్రం ఎటువంటి స్పష్టమైన ప్రకటన ఇప్పటివరకు లేదు. సేవా కార్యక్రమాలతో విజయ్ ప్రజలలో మంచి సంపాదించుకున్నప్పటికీ ఆయన తండ్రి, సినీ దర్శకుడు ఎస్‌ఎ చంద్రశేఖర్ నుంచి వచ్చిన కొన్ని లీకులు విజయ్ ఇక రాజకీయాల్లోకి వచ్చేస్తారన్న అభిప్రాయం కలుగచేశాయి. అయితే విజయ్ మాత్రం ఒక దశలో తన అభిమాన సంఘాలను పూర్తిగా రద్దు చేసి ఇటువంటి వదంతులకు చెక్ పెట్టారు.

కాగా..కొద్ది నెలల క్రితం విజయ్ తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10, 12వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించుకున్న విద్యార్థులను రప్పించి వారికి పురస్కారాలు అందచేయడం కొంత సంచలనం కలిగించింది. దీంతో..విజయ్ తన రాజకీయ ప్రవేశానికి పునాది వేసుకుంటున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి.

అయితే..తాజాగా జులై 11వ తేదీన చెన్నైలోని పనయూర్‌లోగల తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఉయక్కం సబ్యులతో విజయ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చర్చలలో ఆయన అభిమాన సంఘాలకు చెందిన కీలక నాయకులు పాల్గొన్నట్లు సమాచారం. తాను ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాత తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని విజయ్ భావిస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 2024లో విజయ్ సొంత రాజకీయ పార్టీ ప్కరటిస్తారని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా కొన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు వార్తాకథనాలు రాశాయి.

విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, త్రిష, అర్జున్, గౌతమ్ వాసుదేవ మీనన్, మిస్కిన్ తదితర ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక చిత్రంలో విజయ్ నటించనున్నారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్‌కు కూడా ఒక చిత్రం విజయ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సాధ్యమైనంత త్వరితంగా ఈ ప్రాజెక్టులను పూర్తిచేసుకుని విజయ్ వచ్చే అసెంబ్ల్లీ ఎన్నికల నాటికి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News