Thursday, January 23, 2025

750 కోట్ల‌ టర్నోవర్ తో విజయ డెయిరీ నడుస్తోంది: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో నెంబర్ వన్ స్థానానికి విజయ డెయిరీని తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎన్ టిఆర్ పార్క్, లుంబినీ పార్క్ ల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్ క్రీమ్ పార్లర్ లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. నష్టాలలో ఉన్న విజయ డైరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత అభివృద్ధి పథంలో నడిపించామని, 750 కోట్ల‌ టర్నోవర్ తో నడుస్తుందని ప్రశంసించారు. గతంలో విజయ డైరీ ఉత్పత్తులు అందరికీ అందుబాటులోకి తీసుకరాలేదని, ఇప్పుడు 1000 అవుట్ లేట్స్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో ఉన్న పాల ఉత్పత్తి దారులతో సమావేశం ఏర్పాటు చేశామని తలసాని వివరించారు. పాల సేకరణ ధరను లీటర్ కు 5 రూపాయలు పెంచడం జరిగిందని, అన్ని పాల ఉత్పత్తులు మన విజయ డైరీలో‌ దొరుకుతాయని, మార్కెట్ లో పోటీ పడి ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకోస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News