Monday, December 23, 2024

విజయ డైరీది రూ.700 కోట్ల టర్నోవర్: తలసాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నూతనంగా ఔట్ లెట్ లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో కి తీసుకవచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్ సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నష్టాలలో ఉన్న విజయ డైరీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ, శ్రద్ధ చూపడంతో  నేడు 700 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుందని మంత్రి చెప్పారు.

విజయ డైరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉందని, కానీ గత ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాలేదని విమర్శించారు. ఇంకా మరిన్ని ఔట్ లెట్ లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతామన్నారు. విజయ పేరుతో డైరీ లో నూతనంగా అనేక ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకరావడం జరిగిందన్నారు. పాడి రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మంత్రి వివరించారు. విజయ డైరీ అభివృద్ధి చర్యలలో భాగంగా 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డైరీ నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News