Monday, January 20, 2025

మిలటరీ ఆఫీసర్‌గా…

- Advertisement -
- Advertisement -

Vijaya devarakonda act as military officer

 

విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఒక కొత్త సినిమా మొదలుకానుంది. మజిలీ, నిన్ను కోరి చిత్రాలు తీసిన శివ నిర్వాణ ఈ సారి కాశ్మీర్ నేపథ్యంగా ఒక సినిమా తీస్తున్నాడు. అంటే సినిమా మొత్తం కాశ్మీర్‌లో ఉండదు. కొంత భాగం అక్కడ ఉంటుంది. ఈ సినిమాలో మిలటరీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. కాశ్మీర్‌లో ప్రేమలో పడి, అక్కడే పెళ్లి చేసుకుంటాడు. ఆ యువతిగా సమంత నటించనుంది. సమంతతో ఇంతకుముందు విజయ్ దేవరకొండ ‘మహానటి’లో నటించాడు. అది చిన్న పాత్ర. ఇప్పుడు పూర్తి స్థాయిలో లవర్స్‌గా నటిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే మిలటరీ కటింగ్ చేయించుకున్నాడు విజయ్ దేవరకొండ. అన్నట్లు పూరి జగన్నాధ్… విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తోన్న ‘జన గణ మన’ చిత్రంలో కూడా ఇదే లుక్ ఉంటుంది. మిలటరీ కటింగ్‌తోనే విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. అయితే ముందు షూటింగ్ జరుపుకునేది శివ నిర్వాణ చిత్రమే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News