- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విజయ డెయిరీ సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పొషిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్పోరేట్ రెస్పాన్స్‌బులిటి కింద వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకోసం విజయ డెయిరీ అధ్వర్యంలో ప్రతిఏటా రూ.17లక్షలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. అఫ్జల్ గంజ్ లోని చుడి బజార్ లో నిర్వహిస్తున్న రెయిన్ బో హోమ్ కు తెలంగాణ విజయ డెయిరీ ద్వారా 93 మంది బాలికల కోసం ప్రతి రోజు 20 లీటర్ల పాలను సంవత్సరం పాటు ఉచితంగా సరఫరా చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ పత్రాన్ని నిర్వాహకులకు తలసాని అందచేయడం జరిగింది.
- Advertisement -