- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ద్వారా సరఫరా అవుతున్న విజయ బ్రాండ్ పాలు అమ్మకపు ధరలను పెంచినట్టు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జున్ తెలిపారు. లీటరు పాలకు రూ.2 పెంచినట్టు తెలిపారు. పెంచిన ధరలు ఈ నెల 15నుండే అమల్లో ఉంటాయని వెల్లడించారు. పెరిగిన పాల ధరలు 500ఎంల్ పాల ధర టోన్డ్ మిల్క్ రూ.23నుంచి 24కు పెరగనుంది. అదే విధంగా ఆవుపాలు రూ.25నుండి రూ.26కు పెరగనుంది. లీటర్ టోన్డ్ మిల్క్ రూ.49నుండి రూ.51కి పెరగనుంది. స్టాండర్డ్ మిల్క్ 500ఎంల్ రూ.27నుండి రూ.28కి పెరగనుంది. హోల్ మిల్క్ రూ.33 నుండి రూ.34కి పెరగనుంది. డైట్ మిల్క్ రూ.22నుండి రూ.23కు పెరగనుంది. టీ స్పెషల్ రూ.24నుండి రూ.25కు పెరగనుంది. పెంచిన పాల ధరలకు వినియోగదారులు సహకారం అందించాలని జిఎం మల్లికార్జున్ విజ్ణప్తి చేశారు.
- Advertisement -