Monday, January 20, 2025

పండగ ఎఫెక్ట్… విజయ అవుట్ లెట్ వద్ద క్యూ కట్టిన వినియోగదారులు

- Advertisement -
- Advertisement -

తక్కువ ధరలకే నూనేలను అందిస్తున్న
రాష్ట్ర నూనే గింజల అభివృద్ది సంస్థ

మన తెలంగాణ,సిటీబ్యూరో: తెలంగాణ నూనే గింజల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌లో ఏర్పాటు చేసిన విజయ బ్రాండ్ ఆయిల్ అవుట్‌లెట్ వద్ద వినియోగదారులు భారీ ఎత్తున క్యూకడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిపెద్ద పండగ కావడంతో పిండి వంటలను భారీ ఎత్తున తయారు చేస్తారు. వంటలను తయారు చేసుకునేందుకు ప్రధానంగా కావాల్సిన శుచికరమైన,శుభ్రమైన, వంట నూనేలు తక్కువ ధరలకే లభించడంతో సామాన్య వినియోగదారుల నుంచి ఉన్నత శ్రేణి వర్గాల వారు సైతం పెద్ద ఎత్తున నూనేలను కోనుగోలు చేస్తుండటంతో అవుట్‌లెట్ వద్ద పెద్ద సంఖ్యలో వినియోగదారులు వచ్చి చేరుతున్నారు. గత మూడు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తన వినియోగదారులు ఈ అవుట్‌లెట్‌కు రావడం ఇదే మొదటి సారని నిర్వహకులు అభిప్రాయ పడుతున్నారు.

కరోనా భయంతో గత రెండు సంవత్సరాలు (2020..21) పండుగలను జరుపుకోక పోలేదని దాంతో నూనేల అమ్మకాలకు కూడా బ్రేక్ పడిండి. కరోనా పరిస్థితులను నుంచి కొలకుంటున్న దశలోనే రష్యా, ఉక్రెయిన్ యుద్దం నూనే ఉత్పత్తులపై ప్రభావం చూపడంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటిని సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అన్నిరకాల పరిస్థితులను అధిక మించడమే కాకుండా నూనే దిగుబడులు పెరగడంతో నూనేల ధరలు కూడా సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. అంతే కాకుండా ప్రభుత్వం కూడా నూనేగింజల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించడంతో వాటి దిగుబుడుల కూడా అధికం కావడంతో నూనేల ధరలు కూడా దిగివచ్చాయి. ఇతర బ్రాండ్ ఆయిల్‌లో పొలిస్తే విజయ బ్రాండ్‌కు సంబంధించిన అన్ని రకాల నూనేలు అతి తక్కువ ధరకే లభిస్తుండంతో వినియోగదారులు వాటి కొనుగోళ్ళపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

పెరిగిన విజయ బ్రాండ్ ఉత్పత్తులు:

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన విజయ బ్రాండ్ నూనే ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేవలం నూనే ఉత్పత్తులపైనే కాకుండా ఇతర ఉత్పత్తులపై దృష్టి సారించింది. నిన్న మొన్నటి వరకు వంట నూనేలకు మాత్రమే పరిమితం అనుకున్న విజయ బ్రాండ్ ఇప్పుడు బాదం, జీడి పప్పు, వాల్‌నట్స్,అంజూర్ పండు తదితర డ్రైప్రూట్స్‌తో పాటు జోన్న పిండి, రాగిపిండి, కారం పోడి, గోధుమ పిండిలతో పాటు, కందిపప్పు, మినపుప్పు,పల్లీలు, బాసుమతి రైస్‌తో, సోనా మూసూరి బియ్యం ,టీ పోడి, వాటర్ బాటిళ్ళను కూడా ఈ డిపోల ద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకు అందిస్తున్నారు.

అంతే కాకుండా ఈ ఉత్పత్తులున మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు కొంత సబ్సిడీ (డిస్ట్రిబ్యూషన్ ధరకు) అందిసున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో అనేక బ్రాండ్‌లకు సంబంధించిన నూనేలు అందుబాటులో ఉంటూ వేటికవే గొప్పవంటూ ప్రచారం చేసుకోవడంతో వినియోగదారులు కొంత అయోమయంలో పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రకాల నూనేలు విజయబ్రాండ్ పేరుతో ఇతర కంపెనీల కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి రావడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News