Tuesday, January 21, 2025

’యజ్ఞం’ విలన్ విజయ రంగరాజు మృతి

- Advertisement -
- Advertisement -

యజ్ఞం మూవీ సినిమాతో తెలుగులో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ఓ ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారం నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న రాజ్‌కుమార్ మళ్లీ నార్మల్ అవుతారనుకునేలోపు గుండెపోటుతో మృతి చెందారు. విజయ రంగరాజు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కెరీర్‌ను స్పోరట్స్‌లో ప్రారంభించారు. తర్వాత నటన మీద ఆసక్తితో మద్రాసులోని రంగస్థల కళాకారునిగా చేశారు.

స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు వియత్నాం అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. మోహన్‌లాల్ హీరోగా చేసిన ఈ సినిమాలో విజయ రంగరాజు విలన్‌గా చేశారు. తర్వాత తెలుగులో 1994లో భైరవద్వీపంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. బాలయ్య హీరోగా చేసిన ఈ సినిమా తెలుగులో మంచి హిట్‌ని అందుకుంది. అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్ అయినా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భైరవద్వీపం చేస్తున్న సమయంలో విజయ బ్యానర్‌పై విలన్‌గా పరిచయమవుతున్నందుకు ‘విజయ‘.. పాతాళ భైరవిలో ఎస్.వి.రంగారావు తరహా పాత్రను చేస్తున్నందుకు ‘రంగ‘.. అసలుపేరులోని ‘రాజు‘ను కలిపి.. ‘విజయ రంగరాజు‘గా పేరు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News