హైదరాబాద్: మహిళా అధికారితో సంబంధంపై వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి స్పందించారు. విధి నిర్వహణలో చాలా మంది ప్రజలు, ఆఫీసుర్లు, ప్రజాప్రతినిధులు కలుస్తానని, కలిసినంత మాత్రాన సంబంధం అంటగడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతయుతమైన ఎంపిగా తన పని తాను చేసుకుంటుంటే ఓ ఆదివాసీ మహిళాతో సంబంధం అంటగట్టడంపై ఆయన మండిపడ్డారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించిన మీడియా సంస్థలను వదలనని హెచ్చరించారు. య్యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడం పాటు పరువు నష్ట దావా వేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని, వైసిపి కార్యకర్తలపై దాడులు చేయడంతో వారు తమ ఇండ్లను వదిలి పారిపోతున్నారని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎపిలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, సిఎం చంద్రబాబు నాయుడు పాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని దుయ్యబట్టారు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా… ఐదేళ్లకు ఎన్నికలు వచ్చి వైఎస్‌ఆర్‌సిపి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహిళా అధికారితో సంబంధంపై స్పందించిన విజయసాయి రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -