హైదరాబాద్: దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజునే దుర్గాదేవి, మహిషాసురుని వధించింది. ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం దశమి తిథి అక్టోబర్ 12 ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 13 ఉదయం 9.08 గంటల వరకు కొనసాగుతుంది. తిథి ప్రకారం అక్టోబర్ 12(శనివారం) దసరా పండుగ జరుపుకోనున్నారు.
ఇక హిందువుల విశ్వాసం ప్రకారం ప్రదోష కాలంలో రావణ దహనకాండ జరుగుతుంది. పంచాంగం ప్రకారం అక్టోబర్ 12న రావణ దహన కాండ సాయంత్రం 5.53 నుంచి 7.27 మధ్యన జరుగుతుంది.
దసరా రోజు మధ్యాహ్నం 2.03 నుంచి 2.49 వరకు శస్త్రపూజ లేక ఆయుధ పూజను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆయుధ పూజకు 46 నిమిషాల సమయమే ఉండనున్నది. చెడుపై విజయంగా దసరా పండుగను జరుపుకుంటుంటారు. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేయడం వంటి శుభ కార్యాలు జరుపుతారు.