Monday, November 25, 2024

ఆసుపత్రి నుంచి విజయకాంత్ డిశ్చార్జ్

- Advertisement -
- Advertisement -

Vijayakanth discharged from hospital

చెన్నై: తమిళ ప్రముఖ నటుడు, డిఎండికె చీఫ్ విజయకాంత్ పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే నిన్న సాయంత్రం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి హెల్త్ బులిటెన్ రాకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కెప్టెన్ విజయకాంత్ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అకావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని, తన ఆరోగ్యం గురించి పుకార్లు నమ్మవద్దని పార్టీ వర్గాలు తెలిపారు. విజయాకాంత్ 2020 సెప్టెంబరులో కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అతను 10 రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అతని భార్య ప్రేమలత కూడా కరోనా వైరస్ సోకింది. చికిత్స పొందిన తరువాత, ఈ జంట అక్టోబర్ 2 న డిశ్చార్జ్ అయ్యారు.

Vijayakanth discharged from hospital

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News