Sunday, December 22, 2024

విజయకాంత్ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

ప్రముఖ తమిళ హీరో, ఎండిఎంకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విజయకాంత్ గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నా, గత 24 గంటలుగా నిలకడగా లేదని ఆస్పత్రివర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం లేదనీ, పల్మొనరీ ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉందని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. మరో 14 రోజులపాటు విజయకాంత్ చికిత్స తీసుకోవలసి ఉంటుదని చెప్పాయి.

విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చివరిసారి ‘సగపథం’ అనే సినిమాలో నటించారు. తన కుమారుడు షణ్ముగ పాండ్యన్ నటించిన ఈ తొలి సినిమాలో విజయకాంత్ కామెడీ రోల్ పోషించారు. హీరో విజయ్ ఆంథొనీతో కలసి ‘మజయ్ పిడిక్కత మణితన్’ అనే సినిమాలో విజయకాంత్ నటిస్తున్నట్లు ఆమధ్య వార్తలొచ్చినా, ఆయన అనారోగ్యంవల్ల సినిమా షూటింగ్ పెండింగ్ లో పడింది. విజయకాంత్ కు గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News