Friday, January 3, 2025

విజయకాంత్‌ను హత్య చేశారు… ఉదయ్‌నిధి సర్ జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

చెన్నై: డిఎండికె అధినేత, సినీ హీరో కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. మలయాళంలో ప్రేమమ్, గోల్డ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్ఫోన్స్ పుత్రెన్ సంచలన కామెంట్లు చేశారు. ఉదయ్‌నిది సర్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పుత్రెన్ పోస్టు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలితను ఎవరు చంపారో కనిపెట్టాలని, అలానే కెప్టెన్ విజయకాంత్‌ను హత్య చేశారని, నిందితులను పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తేలికగా తీసుకోకండి. గతంలో స్టాలిన్ సర్, ఇండియన్ 2 సెట్స్‌లో కమల్ హాసన్ పై హత్యాయత్నం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకోలేకపోతే ఉదయ్ నిధిని కూడా హత్య చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News