Thursday, November 14, 2024

డిఎండికె అధినేత విజయ్‌కాంత్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిఎండికె అధినేత, నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ విజయ్‌కాంత్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని అధికారికంగా తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు. మియాట్ ఆస్పత్రికి పార్టీకార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయ్ ఇంటికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. 1952 ఆగస్ట్ 25న మధురైలో ఆయన జన్మించారు. విజయ్ తొలి సినిమా ఇనిక్కుమ్ ఇళమై. 2005 సెప్టెంబర్ 14న డిఎండికెను ఆయన స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.

యాక్షన్ హీరోగా విజయ్ కాంత్‌ను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించి అభిమానులను మెప్పించారు. 27 ఏళ్ల వయస్సులో సినీ రంగ ప్రవేశం చేసి 2015వరు నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషం. విజయ్‌కాంత్ నటించిన ఆఖరి చిత్రం సగప్తం 2015లో విడుదల చేశారు. 20కి పైగా పోలీస్‌కథల్లోనే నటించి ప్రేక్షకులను అలరించారు. తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం తరువాత కెప్టెన్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకున్నారు. తన కెరీలో తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో కూడా నటించారు. ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయి మంచి విజయాలు సాధించాయి. విరుధగిరి అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. వల్లారసు, నరసింహ, సగప్తం చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News