చెన్నై: అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమి నుంచి విజయకాంత్ పార్టీ వైదొలగింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము కోరిన నియోజక వర్గాలను కేటాయింకపోవడం, తాము అడిగినన్ని స్థానాలు ఇవ్వకపోవడంతో హీరో విజయకాంతద్‌కు చెందిన దేశీయ మురుపొక్కు ద్రావిడ కజగం(డిఎండికె) కూటమినుంచి వైదొలుగుతున్నట్లు విజయకాంత్ మంగళవారం ప్రకటించారు. సీట్ల పంపకంపై అన్నాడిఎంతో మూడు రోజుల పాటు జరిగిన చర్చలు విఫలమైనట్లు ఆయన తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం వ్యక్తమయిన తర్వాత అన్నాడిఎంకెతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించినట్లు విజయకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. డిఎండికె కనీసం 25 స్థానాలు ఆశించగా.. అన్నాడిఎంకె మాత్రం 15 స్థానాలు ఇవ్వడానికి మాత్రమే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డిఎండికె అన్నాడిఎంకెబిజెపి కూటమి భాగస్వామిగా పోటీ చేసింది. అన్నాడిఎంకె ఇప్పటికే పిఎంకె, బిజెపితో సీట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పిఎంకెకు 23, బిజెపికి 20 అసెంబ్లీ స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరింది. ఉప ఎన్నిక జరుగుతున్న కన్యాకుమారి లోక్‌సభ స్థానాన్ని కూడా బిజెపికి కేటాయించారు.
Vijayakanth roll out to AIADMK Alliance