Wednesday, January 22, 2025

ఆ కుంభకోణంలో విజయసాయిరెడ్డి, శరత్ పాత్రేమిటి….

- Advertisement -
- Advertisement -

అమరావతి:  మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి పాత్రేమిటో చెప్పాలని వైసిపి ప్రభుత్వాన్ని బిజెపి నేత లంకా దినకర్ నిలదీశారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను లంకా దినకర్ ఖండించారు. విశాఖపట్నం దసపల్లా భూములను తన కుమార్తె పేరిట విజయసాయి రెడ్డి కాజేశారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పగిలిపోయిన పోన్ల వివరాలు విజయసాయి రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎపి మద్యం కుంభకోణంలో ఎవరి ఫోన్లు పగులుతాయో వేచి చూస్తున్నామని, నాసిరకం మద్యం తయారీలో విజయసాయి రెడ్డి అల్లుడి కుటుంబమే ఉందని లంకా దినకర్ ఎద్దేవా చేశారు.

Also Read: చంద్రబాబు ఆరోగ్యంపై ఎగతాళిగా మాట్లాడటం సరికాదు: రామకృష్ణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News