Monday, January 27, 2025

విజయసాయిరెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా చేయొద్దని విజయసాయిరెడ్డిని కోరానని ఎంపి గురుమూర్తి తెలిపారు. పార్టీలో ఎటువంటి సమస్యలు లేవని, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో సాయిరెడ్డి చెప్పలేదని గుర్తుమూర్తి పేర్కొన్నారు.

శుక్రవారం వైసిపి సీనియర్ నేత విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన నిన్న ట్వీట్ చేశారు. ఏ రాజకీయపార్టీలో చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి రాజీనామా చేరడంలేదన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని, ఎవరూ ప్రభావితం చెయ్యలేదని, నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని వివరణ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News