అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా భీమిలిలో వైసిపి నేత, ఎంపి విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. సముద్రపు తీరం వెంబడిలోని సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లోని స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలు ఉండడంతో అవి ఆక్రమంగా నిర్మించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జివిఎంసి అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి విశాఖ పట్నంలో ప్రైవేటు, ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ పట్నంలో వైసిపి నేతలు చేసిన భూదందాపై విచారణ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్ లో హైడ్రా మాదిరిగా వైజాగ్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
విశాఖలో అక్రమ కట్టడాలు కూల్చివేత….ఎంపి విజయసాయి రెడ్డి కుమార్తె కు షాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -