Monday, April 28, 2025

కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా విజయశాంతి

- Advertisement -
- Advertisement -

నిన్న కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి ఆ పార్టీ అధిష్ఠానం కీలకమైన పదవిని అప్పగించింది. వారంరోజుల క్రితం బిజేపీకి గుడ్ బై చెప్పిన విజయశాంతి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరింది. రాములమ్మ ఇలా చేరిందో లేదో ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నికలకు సంబంధించి పెద్ద బాధ్యత అప్పగించింది. ఆమెను తెలంగాణా ఎన్నికల ప్రచార, ప్రణాళికా కమిటీకి చీఫ్ కోఆర్డినేటర్ గా నియమిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇదే కమిటీలో 15మంది నాయకులను కన్వీనర్లుగా నియమించారు. వీరిలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, వేం నరేంద్రరెడ్డి, ఎరావతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News