Wednesday, January 22, 2025

మళ్లీ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం… మళ్లీ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి నేత నటి విజయశాంతి పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణలో ప్రజలు, విద్యార్థులు ఉద్యమం చేశారని, ఇప్పుడు రాజకీయ పరస్థితులు అధ్వానంగా ఉండడంతో అందరూ కలిసి పోరాడాలని పేర్కొన్నారు. తెలంగాణ అధికారి పరిణామ ధోరణుల దృష్ట్యా ప్రతి సారి తెలంగాణ బిడ్డలకు నేర్పిన దారి పోరాడడం అని విజయ శాంతి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా అసెంబ్లీ ఎన్నికలలో జాతిపిత మహాత్మ గాంధీ పోటీ చేసిన కూడా గాంధీజీ పోటోలున్న నోట్ల ముందు ఆయన ఓడిపోవడం ఖాయమన్నట్టుగా ట్వీట్ చేశారు. బిఆర్‌ఎస్, సిఎం కెసిఆర్ చేతిలో పడి తెలంగాణ ప్రజలు జీవితాలు నాశనం చేసుకోవద్దని విజయ శాంతి కోరారు.

Also Read: తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యిని సరఫరా చేసి నష్టపోము: కెఎంఎఫ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News