Friday, April 4, 2025

బిజెపి నేతలకు అది అన్యాయం అనిపించలేదా?: విజయశాంతి

- Advertisement -
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూములను గతంలో కొందరు కబ్జా చేయాలనుకున్నప్పుడు బిజెపి నాయకులకు కనబడలేదా అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజీ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారని, చంద్రబాబు నాయుడు ఆ భూములను ఇతరులకు కేటాయించడం తెలంగాణ బిజెపి నాయకులకు న్యాయం అనిపించినప్పుడు ఐఎంజీ సంస్థ ఈ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు

తెలంగాణ బిజెపి నేతలకు అది అన్యాయం అనిపించలేదని విజయశాంతి ప్రశ్నించారు. 2004లో బిజెపి కూటమిలో టిడిపి ఉన్నప్పుడు ఐఎంజీ సంస్థకు చంద్రబాబు 400 ఎకరాల స్థలాన్ని బదలాయించారని, ఇప్పుడు బిజెపి నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తు రాలేదా అని విజయశాంతి అన్నారు. ప్రస్తుతం ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొట్లాడి, ఈ భూములను కాపాడి, వాటిని అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ తెలంగాణ బిజెపి నేతలు నానాహంగామా చేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెలంగాణ సమాజం బిజెపి నేతలను నిలదీస్తుందని విజయశాంతి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News