Monday, December 23, 2024

బిజెపి పరువు పోయింది: విజయశాంతి

- Advertisement -
- Advertisement -

తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు

హైదరాబాద్: మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గాంధీభవన్ లో విజయశాంతి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కెసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బిజెపి చెబితే వెళ్లానని చెప్పారు. ఏళ్లు గడిచినా కెసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కెసిఆర్ అవినీతిపరుడని బిజెపి నేతలు విమర్శిస్తారు.. కెసిఆర్ అవినీతిపరుడైతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.

ఆధారాలు ఉండి కూడా బిజెపి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బిజెపి, బిఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్నారు. తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయని విజయశాంతి ఆరోపించారు. అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించవద్దని కోరామన్నారు. సంజయ్ ను తొలగించడంతో బిజెపి పరువు పోయిందన్నారు. కెసిఆర్ ఓడించడమే ఉద్యమకారుల లక్ష్యమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News