Saturday, April 26, 2025

అర్థం చేసుకునే వారికి చెప్పగలం:విజయశాంతి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ అంతరించి పోతుందని బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత విజయశాంతి, పార్టీ మార్పుపై కూడా ట్విట్టర్ వేదికగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు వార్తలపై విజయశాంతి స్పందిస్తూ ‘దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలాంటివో గత, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించాలని ఆమె ట్వీట్‌లో సూచించారు. దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్థం చేసుకునే తీరు, బిజెపి దండయాత్ర విధానం గురించి శుక్రవారం తన పోస్టులో వ్యక్తపరిస్తే అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు ఆ పోస్టుపై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు జోడిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే… అర్థం చేసుకునే వారికి చెప్పగలం కానీ, ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పనిపెట్టుకున్న వాళ్లకు వివరణ ఇచ్చిన ప్రయోజనం లేదని ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News