Monday, December 23, 2024

అధిష్టానానికి చెప్పినా వినలేదు

- Advertisement -
- Advertisement -

బిజెపి చేజేతులా ఆ పార్టీని నాశనం చేసుకుంటోంది
బిజెపి పార్టీలో తెర ముందు ఒకటి తెర వెనుక మరొకటి జరుగుతుంది
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి వీడి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చి ఆ పార్టీ ఇబ్బందులు కొని తెచ్చుకుందని ఆమె వ్యాఖ్యానించారు. కొందరు కోవర్టులు బండి సంజయ్‌ను మార్చాలని హైకమాండ్ చుట్టూ తిరిగి పదే పదే చెప్పడంతో బిజెపి అధిష్టానం సైతం బండి సంజయ్‌ను మార్చివేసిందని ఆమె ఆరోపించారు.

ఎన్నికలకు నాలుగు నెలల ముందు బండి సంజయ్‌ను మార్చవద్దని అధిష్టానానికి చెప్పినా వినలేదని ఏ శత్రువుతో పోరాడుతున్నామో అదే శత్రువుతో చేతులు కలిపితే పార్టీలో ఎలా ఉండగలమని ఆమె ప్రశ్నించారు. బిజెపి చేజేతులా ఆ పార్టీని నాశనం చేసుకుంటోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి శనివారం గాంధీ భవన్‌లో విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ బిజెపి పార్టీలో తెర ముందు ఒకటి తెర వెనుక మరొకటి జరుగుతుందన్నారు. బిజెపిలోని కొంతమంది లీడర్లు తన గురించి అసభ్యంగా మాట్లాడారని, వారు నోరు అదుపులో పెట్టుకోవాలని తాను హెచ్చరించారన్నారు.

మా గురువు అద్వానీ విలువైన రాజకీయాలు నేర్పారని, కానీ, ప్రస్తుత బిజెపి నేతలకు ఆ విలువలు లేవన్నారు. గతంలో తాను పనిచేసిన పార్టీలే తనను మోసం చేశాయని, తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. బిజెపిలో ఉండి పార్టీలో జరుగుతున్న వాటిని అధిష్టానంతో మాట్లాడానన్నారు. కాంగ్రెస్‌లో చేరడం పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News