రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి, శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన ఒక సమావేశంలో ఆమె ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమెను ఖర్గే సాదరంగా ఆహ్వానించారు. మెదక్ ఎంపీ స్థానాన్ని విజయశాంతికి కేటాయిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. విజయశాంతి కొన్ని రోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉంటూ వచ్చారు. పార్టీలో కీలకమైన నిర్ణయాలను సమష్టిగా తీసుకోవడం లేదని, అందరినీ సంప్రదించకుండా ఒకరిద్దరు మాత్రమే తీసుకుంటున్నారన్నది ఆమె అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని, అమిత్ షా వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నా, విజయశాంతి దూరంగానే ఉంటున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి గారు. pic.twitter.com/2yIEhjlXG1
— Telangana Congress (@INCTelangana) November 17, 2023