Monday, December 23, 2024

మణిపూర్ ఘటన తీవ్ర వేదనకు గురిచేస్తోంది.. బాధ్యులను ఉరితీయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల జరిగిన మణిపూర్ ఘటనపై బిజెపి నాయకురాలు విజయశాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటన సభ్య సమాజం సిగ్గుతో బాధపడుతోంది. మణిపూర్ సంఘటనలు తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి.ఈ ఘటనకు కారణమైన నిందితులను ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ సంఘటనకు సంబంధించిన వీడియోె బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News