నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆరట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘భారత దేశంలో ఏ నటి విజయశాంతి లాంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయలేదు.
ఈ చిత్రం కర్తవ్యంలో ఉన్న పాత్రకు ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఆలోచన నుంచే మొదలయింటుందని భావిస్తున్నాను. ఈ సినిమా నేను చూశాను. విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదు.18 తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది ఈ సినిమా. రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా మలిచారు. ప్రతిసారి కాలర్ ఎగరేయమని నేను చెప్తుంటాను. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ని నేను ఎగరేస్తున్నాను. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ అన్న కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది‘అని అన్నారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ‘మనం చాలా సినిమాలు చూస్తాం.
థియేటర్ నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలే ఇంటికి వెళ్లక కూడా మనసుని హత్తుకు హత్తుకునే ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి‘ అని తెలిపారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తల్లి కొడుకు పాత్రల మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు ‘ అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ప్రొడ్యూసర్ అశోక్ వర్ధన్ ముప్పా, హీరోయిన్ సాయి మంజ్రేకర్, డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తదితరులు పాల్గొన్మారు.