Sunday, December 22, 2024

గజ్వేల్‌లో బండి సంజయ్..కామారెడ్డిలో నేను ఉంటా.. : విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ, బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాకపోయినప్పటికీ పార్టీ ఆదేశిస్తే అందుకు సిద్ధమని ఆమె చెప్పారు. ఆమె మొదటి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీపై దృష్టి పెడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తనను కామారెడ్డి, బండి సంజయ్‌ని గజ్వేల్ నుంచి పోటీ చేయమని కార్యకర్తలు అడుగుతున్నారని, అందులో సమస్య ఏమీ లేదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. బిఆర్‌ఎస్‌పై రాజీలేని పోరాటం చేయడంలో బిజెపి వెనక్కు తగ్గదని కార్యకర్తల విశ్వాసమని, అందుకే గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తనను అసెంబ్లీకి ముఖ్యమంత్రి కెసిఆర్‌పై పోటీ చెయ్యాలని కార్యకర్తలు అడగటం తప్పేమీ కాదన్నారు. వ్యూహాత్మక నిర్ణయాల కోసం పార్టీ నిర్దేశిస్తే పోటీకి సిద్ధమన్నారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అభ్యర్థుల ప్రకటన, బి ఫారాల పంపిణీతో పాటు ప్రచారంలో బిఆర్‌ఎస్ ఇప్పటికే ముందుంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల వేటలో ఉండగానే ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇలా ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్ తాను పోటీ చేసే నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు. దీంతో బలమైన అభ్యర్థులను నిలబెట్టి కేసీఆర్ ను ఓడించాలని.. తద్వారా జాతీయ రాజకీయాలకు సిద్ధమైన బిఆర్‌ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలని బిజెపి భావిస్తోంది. కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కూడా బలమైన నేతలు పోటీ చేయాలని బిజెపి కార్యకర్తలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News