Sunday, December 22, 2024

విజయవాడలో పట్టపగలు నడి రోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కూతురును సంసారానికి పంపించకపోవడంతో పాటు విడాకులు ఇప్పిస్తుందని అత్తను అల్లుడు నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని చిట్టినగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏక లవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేష్ అనే వ్యక్తి , వైఎస్‌ఆర్ బ్లాక్ కాలనీకి చెందిన లలితను 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దంపతులు రాజీకి రాకపోవడంతో కేసు కోర్టుకు వెళ్లింది. అల్లుడు రాజేష్ తన అత్త నాగమణి, మామ గురుస్వామిలు తమ మధ్య గొడవలు పెడుతున్నాడని రగిలిపోతున్నాడు. అత్త నాగమణి తన కాపురాన్ని నాశనం చేసిందని పగ పెంచుకున్నాడు. కోర్టు కూడా వచ్చే వాయిదాలో ఇద్దరికి విడాకులు ఇస్తామని చెప్పడంతో తన భార్య తన వద్దకు రాదని ఆవేశంతో అల్లుడు ఉన్నాడు.

Also Read: మణిపూర్ ప్రజలకు భరోసా ఇవ్వాలి

నాగమణి తన భర్తతో కలిసి పెద్ద కూతురు ఝాన్సీ ఇంటికి వెళ్తున్న విషయం రాజేష్‌కు తెలిసింది. వెంటనే కొబ్బరి కాయల కత్తి తీసుకొని సాయిరామ్ థియేటర్ వద్ద వేచి ఉన్నాడు. అత్తమామలు వస్తున్న వాహనాన్ని గమనించి దగ్గరకు రాగానే అత్త కుడి చేతిని నరికాడు. ఆమె కిందపడిపోవడంతో వెంటనే కత్తి తీసుకొని పలుమార్లు మెడపై నరికాడు. మామను చంపుదామని వెంబడించడంతో అతడు తప్పించుకున్నాడు. రాజేష్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సిఐ సుభ్రమణ్యం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగమణి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News