Wednesday, January 22, 2025

రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ప్రమాదం: ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండి

- Advertisement -
- Advertisement -

అమరావతి: 24 గంటల్లో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  బస్సు ప్రమాదం దురదృష్టకరమని, రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. మానవ తప్పిదమా?… సాంకేతిక తప్పిదమా? అనేది తెలియాల్సి ఉందని, మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. విజయవాడ బస్టాండులో ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News