Wednesday, January 22, 2025

ప్రేమకు ప్రియురాలి తండ్రి అడ్డు…. పొడిచి చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమకు ప్రియురాలు తండ్రి అడ్డుగా ఉండడంతో అతడిని ప్రియుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని కృష్ణలంకలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి సింధూభవన్ వీధిలో నివసిస్తున్నాడు. శ్రీరామ్ జనరల్ స్టోర్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్దకూతురు దర్శిని(22) విజయవాడలోని శ్రీపొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె గత నాలుగు సంవత్సరాల నుంచి మణికంఠ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఇద్దరు ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని దర్శిని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు.

దీంతో మణికంఠను కొన్ని రోజుల క్రితం శ్రీరామ్ తన మనుషులతో కలిసి బెదిరించాడు. తన కూతురు దూరంగా ఉండాలని అతడిని హెచ్చరించాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో జనరల్ స్టోర్ మూసివేసి ఇంటికి వెళ్తున్న సమాయంలో శ్రీరామ్‌పై మణికంఠ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీరామ్ మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మణికంఠను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News