Thursday, April 3, 2025

సిఎం జగన్‌ ను కలిసిన విజయవాడ ఎంపి కేశినేని నాని

- Advertisement -
- Advertisement -

విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు. తన సొంత వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యం అనుకున్నానని వెల్లడించారు. టిడిపి కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలా మందే చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజంపై మోశారని స్పష్టం చేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డానని కేశినేని నాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News