Monday, January 20, 2025

విజయవాడలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో చేతిని కోల్పోవాల్సిన పరిస్థితి..

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చేతికి గాయం అయ్యిందని ఆస్పత్రికి వెళిన మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట గ్రామానికి చెందిన తులసి అనే మహిళ ఇళ్లు సర్దుతుంటే ఏదో గుర్తు తెలియని పురుగు కుట్టింది. తర్వాత నొప్పి తీవ్రం కావడంతో సదరు మహిళ విజయవాడ ప్రభుత్వకి వెళ్లింది. దీంతో వైద్యులు ఆ మహిళ చేతికి చిన్నపాటి సర్జెరీ చేశారు. అయితే, సర్జెరీ తర్వాత ఇన్ఫెక్షన్ మరింత పెరిగింది. వైద్యులు సర్జెరీ చేసిన తర్వాత బ్లేడును కూడా చేతిలో పెట్టి కుట్టేశారు.

దీంతో చేయి మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. ఇప్పుడు చేతిని పూర్తిగా తొలగించాలని లేకపోతే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో సదరు మహిళా పరిస్థితి అయోమయంగా మారిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో చేయిని కోల్పోయిే పరిస్థితి రావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News