Monday, December 23, 2024

వైభవంగా ప్రారంభమైన దళపతి విజయ్ 66వ చిత్రం

- Advertisement -
- Advertisement -

Vijay's 66th film which started with glory

 

దళపతి విజయ్ కధానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో వైభవం గా ప్రారంభమైన ఈ చిత్రం, ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుటుంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటిస్తుంది. విజయ్ 66వ చిత్రంగాతెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయనున్నారు.

సూపర్ ఫామ్‌ లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి అద్భుతమైన కథని సిద్దం చేశారు. వంశీ పైడిపల్లి తో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లే ను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News