హైదరాబాద్: కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ‘‘తెలంగాణలో ఇక బిఆర్ఎస్ పార్టీ ఉండదు’’ అని ఎక్స్ మీడియాలో పేర్కొనడాన్ని నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఖండించారు. కిషన్ రెడ్డికి దక్షిణాది పోకడ తెలియదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం.. కరుణానిధి, ఎంజిఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి నేటి బిఆర్ఎస్, వైసిపి వరకు అని చెప్పుకొచ్చారు.
దక్షిణాది స్వీయ గౌరవ భావాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బిజెపి ఆలోచించడం లేదన్నది బహుశా కిషన్ రెడ్డి భావం’ కావొచ్చని విజయశాంతి ‘ఎక్స్’(ట్విట్టర్)లో పేర్కొన్నారు. క్రమంగా బిఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని కిషన్ రెడ్డి అనడాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండించారు. దక్షిణాది విధానాన్ని కిషన్ రెడ్డి సరిగ్గా అర్థం చేసుకోవాలన్నారు. ఉత్తరాది మనస్తత్వం ఇక్కడ చెల్లదని చెప్పకనే చెప్పారు.
తెలంగాణ ల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు
ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు
నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం… ఎప్పటికీ..ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే… pic.twitter.com/IJpq77mQ7z
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 17, 2024