Wednesday, January 22, 2025

బంగ్లాదేశ్ హిందువులపై స్పందించిన నటి విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగ్లాదేశ్ లో హిందువుల నామరూపాలు లేకుండా చేసేందుకు వారి ఆస్తులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని మత మౌఢ్యులు కొందరు దాడులు చేస్తున్నారని, వాటికి సంబంధించిన వీడియోలు చూస్తే ఎవరి మనసైనా తల్లడిల్లుతుందని నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదికలో పోస్ట్ పెట్టారు.

బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ కు చెందిన అనేక మంది హత్యకు గురయ్యారని, వారి ఇళ్లు, వ్యాపార సంస్థలు కూడా ధ్వంసం అయ్యాయని, ఓ నటుడు, అతడి తండ్రి(నిర్మాత) కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకే కొందరు సందర్భాన్ని వాడుకుంటున్నారని అన్నారు. పేరుకే రిజర్వేషన్ల అంశం అయినప్పటికీ ఉగ్రవాద శక్తులకు హిందువులే బలవుతున్నారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News