Monday, December 23, 2024

మాకులపేటలో గడపగడపకు టిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

దండేపల్లి మండలంలోని మాకులపేట గ్రామంలో మంగళవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్మన్, టీఆర్‌ఎస్ నాయకుడు విజిత్‌రావు గడపగడపకు టీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా విజిత్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు నిర్మించిందన్నారు.

రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్‌దేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తించి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, సహకార సంఘం అధ్యక్షుడు కాసనగొట్టు లింగన్న, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ రేణి శ్రీనివాస్, సర్పంచ్, ఉపసర్పంచులు రాజవ్వ, పర్శినేని రాజ్‌కుమార్, మాజీ ఎంపీపీ బండారి మల్లేష్, నాయకులు ఆకుల రాజేందర్, మహేష్, రాజయ్య, శ్రీనివాస్, శంకర్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News